ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు బుధవారం ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ప్రారంభమైంది. ప్రస్తుతం సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో యువ ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ టెస్టు అరంగేట్రం చేస్తున్నాడు. హర్యానాకు చెందిన కాంబోజ్ దేశవాళీ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అంతర్జాతీయ టెస్టు వేదికపై అతని ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది.
సిరీస్‌లో ఆధిక్యం సాధించేందుకు ఇంగ్లండ్ బరిలోకి దిగుతుండగా, భారత్ సమం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Read More : అఫ్ఘనిస్థాన్ క్రికెట్‌లో అరుదైన ఘట్టం: తండ్రి బౌలింగ్, కొడుకు సిక్సర్!

One thought on “ఓల్డ్ ట్రాఫర్డ్‌లో ఇండియా–ఇంగ్లండ్ నాలుగో టెస్టు ప్రారంభం”
Comments are closed.