కేంద్ర ప్రభుత్వం తాజాగా జనగణనపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రెండు విడతల్లో జనగణన నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రత్యేకంగా ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.
జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్ వంటి రాష్ట్రాల్లో 2026 అక్టోబర్ 1 నాటికి జనగణన ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తిగా ముగియనుంది. కేంద్రం నిర్ణయం ప్రకారం, ఈసారి జనగణనకు అనేక ప్రత్యేక మార్పులు తీసుకురానున్నారు.
Read More : హనీమూన్ హత్య కేసులో కీలక ఆధారం వెలుగులోకి

One thought on “జనగణనపై కేంద్ర నిర్ణయం”
Comments are closed.