భారత్ నిర్ణయం – పాక్ కు మరో గట్టి షాక్

పాకిస్తాన్‌కు భారత్ మరో గట్టి మెసేజ్ ఇచ్చింది. పాకిస్తాన్‌తో ప్రత్యక్ష, పరోక్ష ఎగుమతులు–దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిషేధించబడ్డ ప్రత్యక్ష వాణిజ్యానికి తోడు, దొడ్డిదారిన వస్తున్న
పరోక్ష దిగుమతులపైనా తక్షణమే నిషేధం అమలులోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ నిర్ణయం నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన వస్తువులు మూడో దేశాల ద్వారా భారత్‌కి రావడాన్ని పూర్తిగా అడ్డుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు ఇది కీలకమని కేంద్ర వాణిజ్య శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే పాక్‌కు నిర్దేశిత MFN (Most Favoured Nation) హోదాను భారత్ 2019లో ఉపసంహరించుకుంది. తాజా ఆంక్షలతో ఇక పాక్‌కు భారత మార్కెట్‌ పూర్తిగా మూసుకుపోయినట్లే.

ఈ పరిణామం పాక్ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం చూపనున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read More : పాకిస్థాన్‌ తన సరిహద్దు గేట్లు మూసివేసింది