హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధాల నేపథ్యంలో భార్య కట్టుకున్న భర్తను చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే — కేపీహెచ్‌బీకి చెందిన సాయిలు, కవిత దంపతులు కొంతకాలంగా మనస్పర్థలతో వేరుగా జీవిస్తున్నారు. ఇద్దరికీ వివాహేతర సంబంధాలు ఉండటంతో తరచూ గొడవలు జరిగేవి.
ఈ క్రమంలో భర్త సాయిలు తరచూ భార్యను వేధించాడని తెలిసింది. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కవిత ఘోర నిర్ణయం తీసుకుంది. తన చెల్లెలు, చెల్లెలి భర్తతో కలిసి సాయిలు హత్యకు ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం ముగ్గురు కలిసి సాయిలుకు కరెంట్ షాక్ ఇచ్చి హత్యచేశారు.
హత్య జరిగిన తర్వాత మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూడ్చి, సొంతూరుకు వెళ్లిన కవిత.. సాయిలు గురించి ఆరా తీసిన వారికి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే కవిత ప్రవర్తనపై అనుమానం వచ్చిన సాయిలు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిజం వెలుగులోకి వచ్చింది.
కవితను పోలీసులు విచారించగా అసలు విషయాన్ని ఒప్పుకుంది. ప్రస్తుతం ఆమెను అరెస్టు చేసిన పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.
Read More : వైద్య ఆరోగ్య శాఖలో భారీ అవినీతి.. ఉద్యోగ నియామకాలలో అక్రమాలు వెలుగు

One thought on “హైదరాబాద్‌లో భార్య చేతిలో భర్త హత్య”
Comments are closed.