భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. బహదూర్ పల్లిలోని మహీంద్రా యూనివర్సిటీలో మాదక ద్రవ్యాల నియంత్రణ శాఖ (నార్కోటిక్) పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గంజాయి సేవిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గంజాయి, డ్రగ్స్ స్వాధీనం:
అరెస్ట్ అయిన నిందితుల నుంచి పోలీసులు 1.15 కిలోల గంజాయితో పాటు, 47 గ్రాముల ఓజీ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. యువతను లక్ష్యంగా చేసుకొని నగరంలో డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను విచారించిన తర్వాత డ్రగ్స్ సరఫరాదారుల వివరాలను రాబట్టే అవకాశం ఉంది. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Read More : తెలంగాణలో కాంగ్రెస్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

One thought on “మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం”
Comments are closed.