నాలుగు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక

హైదరాబాద్‌ మహానగరంలో వారం రోజులుగా వర్షాలు కురుస్తూ నగరాన్ని ముంచెత్తుతున్నాయి. రాత్రివేళలు కురుస్తున్న భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్నిచోట్ల వర్షపాతం 12 సెంటీమీటర్లకు పైగా నమోదైంది. రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగస్టు 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో, 13 నుంచి 16వ తేదీ వరకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణ అంతటా అలర్ట్
ఈ రోజు, రేపు ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, జనగామ, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే, 13 నుంచి 16 వరకు జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్గొండ, హైదరాబాద్‌ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

రెడ్, ఆరెంజ్‌ అలెర్ట్‌లు జారీ చేసిన వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అవసరమైతే పనివేళల్లో మార్పులు చేసుకోవాలని ప్రజలకు సూచించింది. అలాగే, ఐటీ కంపెనీలకు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

Read More : కేసీఆర్‌కు రాఖీ కట్టిన అక్కలు, చెల్లెలు

One thought on “నాలుగు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక

Comments are closed.