గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న భారీ వర్షాలు బీభత్స స్థాయికి చేరుకున్నాయి. ఇక ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు కుంభవృష్టి తరహా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వర్షం ప్రారంభం కాకముందే ప్రజలు తమ ఇళ్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా వాతావరణ శాఖ తెలియజేసింది. దక్షిణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు జోరుగా కురవనున్నట్లు తెలిపింది. ఇప్పటికే గురువారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదైనట్లు వెల్లడించారు. ఈ ధోరణి శుక్రవారం, శనివారం కూడా కొనసాగనుందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల్లో ప్రత్యేకంగా భారీ వర్షాలే కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా, ఈ నెల 13న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముండటంతో, 13, 14, 15 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మరింత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు ఈ హడావుడిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read More : ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్స్

One thought on “హైదరాబాద్‌లో భారీ వర్షాల హెచ్చరిక”
Comments are closed.