హైదరాబాద్ సినీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వ జోక్యం

హైదరాబాద్‌లో గత 17 రోజులుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. సమ్మె కారణంగా తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషా చిత్రాల షూటింగులు నిలిచిపోవడంతో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ను దేశంలోనే ప్రముఖ సినిమా హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ సమ్మె పెద్ద సవాలుగా మారిందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర సినిమా పాలసీపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.

సమస్య పరిష్కార దిశగా అధికారులు ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. దీనికి కొనసాగింపుగా ఈ రోజు ఫెడరేషన్ నాయకులతో సమావేశం కానున్నారు. అంతేకాకుండా, డీజీపీ కూడా ఫెడరేషన్ నేతలతో నేరుగా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Read More : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి: నివాళులర్పించిన సీఎం