హర్యానాలో మోడల్ శీతల్ చౌదరి (అలియాస్ సిమీ) హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో శీతల్ ప్రియుడు సునీల్‌నే ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి విచారించగా, హత్యను తానే చేశానని ఒప్పుకున్నాడు. శీతల్ మృతదేహం సోనిపట్ సమీపంలోని ఖర్ఖోడా వద్ద ఒక కాలువలో గుర్తించగా, ఆమె గొంతుకోసి, కత్తిపోట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం విఫలం
శీతల్ గల్లంతయ్యిందని నటించిన సునీల్, తన కారు కాలువలో పడిపోయిందని, శీతల్ నీటిలో మునిగిపోయిందని వెల్లడిస్తూ, ఆసుపత్రిలో చేరాడు. అయితే దర్యాప్తులో అతడి కథ నాటకమని తేలింది. శీతల్ మృతదేహం లభించిన అనంతరం సునీల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, మద్యం మత్తులో వాగ్వాదం తలెత్తి హత్యకు దారి తీసిందని అంగీకరించాడు.
అంతిమ ఘడియలు.. వీడియో కాల్లో సమాచారం
శనివారం రాత్రి పానిపట్ సమీపంలోని ఆల్బమ్ షూటింగ్‌కు వెళ్లిన శీతల్, రాత్రి 10:30కి సునీల్‌ను కలిసింది. ఇద్దరూ కారులో వెళ్లగా, మధ్యలో మద్యం సేవించారు. అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో శీతల్ తన సోదరి నేహాకు వీడియో కాల్ చేసి, సునీల్ తనపై దాడి చేస్తున్నాడని చెప్పింది. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో ఆమె ఆచూకీ తెలియలేదు. తక్కువ సమయంలోనే ఆమె హత్యకు గురైందని పోలీసులు వెల్లడించారు.
ఆరు ఏళ్ల పరిచయం.. తిరస్కరించిన ప్రేమ
శీతల్‌కు సునీల్‌తో ఆరు ఏళ్లుగా పరిచయం ఉంది. సునీల్ తన ప్రేమను వివాహంగా మార్చాలని కోరినప్పటికీ, అతడికి ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తెలిసిన శీతల్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. మరోవైపు, శీతల్‌కి కూడా వివాహమై ఐదు నెలల చిన్నారి ఉంది. ఈ సంఘటనకు అసలైన నేపథ్యం తెలుసుకునేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ దారుణ హత్య కేసు, మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు ఉత్కంఠ కలిగిస్తోంది.
Read More : నిందితురాలి మానసిక ఆరోగ్యం బాగానే ఉందని వైద్యుల నివేదిక

One thought on “హర్యానాలో మోడల్ శీతల్ చౌదరి దారుణ హత్య”
Comments are closed.