హైదరాబాద్: రంజాన్ మాసంలో ముస్లింలకు తోఫాలు కూడా అందించలేకపోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాన్ని సూచిస్తున్నదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రంజాన్ తోఫాలతో ముస్లిం కుటుంబాల్లో ఆనందాన్ని నింపిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ పరంపరను కొనసాగించలేకపోయిందని ఆక్షేపించారు.
బంజారాహిల్స్ లేక్‌వ్యూ బంజారాలో ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, ఇతర బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ముస్లిం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఇఫ్తార్ విందులు ప్రజల మధ్య మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
Read More : ఆర్ఎస్ఎస్ భావజాలంతో దేశానికి ముప్పు: అసదుద్దీన్ ఒవైసీ

One thought on “రంజాన్ తోఫాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో రేవంత్ ప్రభుత్వం: హరీష్ రావు”
Comments are closed.