పాకిస్థాన్ మళ్లీ మాస్క్ చించుకుంది

సీమాంతర ఉగ్రవాదాన్ని బలోపేతం చేస్తూ, వరుసగా తప్పులు చేస్తోన్న పాకిస్థాన్ తాజాగా మరో సంచలన తప్పిదాన్ని చేసి అడ్డంగా దొరికిపోయింది. అమెరికా ప్రభుత్వం గట్టి ఉగ్రవాదిగా ప్రకటించిన హాఫీజ్ అబ్దుర్ రవుఫ్‌ను పాక్ మౌలానాగా చూపిస్తూ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనిపించాడు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో మృతిచెందిన ఉగ్రవాదులకు పాకిస్థాన్‌లో ఇటీవల నిర్వహించిన అంత్యక్రియల్లో హాఫీజ్ మౌలానాగా వ్యవహరించడాన్ని వీడియో స్పష్టంగా రికార్డ్ చేసింది. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మృతుల శవపేటికలపై పాకిస్తాన్ జాతీయ జెండాలు చుట్టడం, హాఫీజ్ పక్కనే ఆర్మీ ఉన్నతాధికారులు ఉండడం చూస్తే, పాక్ ఉగ్రవాదానికి ఎంత బహిరంగంగా మద్దతు ఇస్తోంది అన్నది స్పష్టమవుతోంది. మీడియా ముందుకు వచ్చే సమయంలో హాఫీజ్‌కి టోపీ వేయించడం కూడా ఆర్మీ అధికారుల సూచన మేరకే జరిగిందని వార్తలు వెలుగుచూస్తున్నాయి.

ఈ నేపథ్యంపై న్యూఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన భారత అధికారులు స్పందిస్తూ, “ఇది పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని బహిరంగంగా ప్రోత్సహిస్తున్నదానికి స్పష్టమైన రుజువు” అని తీవ్రంగా విమర్శించారు. హాఫీజ్‌ గురించి భారత ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించింది – అతని పుట్టిన తేదీ, వ్యక్తిగత గుర్తింపు నంబర్ (CNIC) తదితర వివరాలు ప్రజల ముందుంచింది.

అంతేకాదు, హాఫీజ్ రవుఫ్ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడిగా ఉండడమే కాక, లష్కరే తోయిబా కార్యకలాపాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నాడని అమెరికా ట్రెజరీ శాఖ వెల్లడించింది. ఆయుధాల సరఫరా, నిధుల సమీకరణ, సభ్యుల నియామకం వంటి కీలక అంశాల్లో హాఫీజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడని స్పష్టమైంది. అతడు ఫలాహ్-ఇ-ఇన్సియాత్ ఫౌండేషన్ అనే సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు కూడా అమెరికా స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ చర్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉగ్రవాదాన్ని పాలక వ్యవస్థే ప్రోత్సహిస్తున్న దేశంగా పాకిస్థాన్ మళ్లీ ప్రపంచం ముందు బహిరంగమైంది.

Read More : ఆఫ్రిది మరోసారి వివాదాస్పదంగా!

One thought on “పాకిస్థాన్ మళ్లీ మాస్క్ చించుకుంది

Comments are closed.