అనేక రోజులుగా ఏపీ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రచారం జరుగుతోందని, దీని పై గృహ వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఈ ప్రచారాలపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పందించారు.
విద్యుత్ ఛార్జీల పెంపు గురించి వస్తున్న వార్తలపై ఆయన స్పష్టం చేస్తూ, “ఏ పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని” ప్రకటించారు. భవిష్యత్తులో కూడా ఛార్జీలను పెంచే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని తెలిపారు. కొంతమంది యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇది వారి కుట్ర అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో, ప్రకాశం జిల్లాలో రెన్యూబుల్ ఎనర్జీ పై పెద్దపీట వేయడం జరిగిందని, పీక్ అవర్స్‌లో రూ. 4.60తో విద్యుత్ సరఫరా చేసే ఒప్పందం కూడా కుదిరిందని మంత్రి తెలిపారు.
ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, నిజమైన సమాచారం కోసం ప్రభుత్వ ప్రకటనలను మాత్రమే అనుసరించాలని ఆయన సూచించారు.
Read More : కోటప్పకొండ గిరిప్రదక్షిణలో అపశృతి.

One thought on “ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి స్పష్టం”
Comments are closed.