మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, కుటుంబసభ్యులు, పరిశ్రమ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభమైన విషెస్ వెల్లువ ఇప్పటికీ కొనసాగుతోంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ అందరూ రామ్ చరణ్‌పై తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ అక్క సుష్మిత పంచుకున్న ఒక ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది.
సుష్మిత చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ తమ్ముడిపై తన ప్రేమను భావోద్వేగపూరితంగా వ్యక్తం చేశారు. ఫోటోలో చిన్ననాటి రామ్ చరణ్‌ను ఎత్తుకుని ముద్దాడుతున్న సుష్మిత చూడవచ్చు. “నా బలం.. నా బ్రహ్మాస్త్రం.. నా ప్రియమైన సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ పదాలు చరణ్ పై నా ప్రేమను వ్యక్తపరచలేవు,” అంటూ ఎమోషనల్ మెసేజ్ రాశారు. ఈ చిత్రంలో సుస్మిత గ్రీన్ గౌన్ ధరించగా, చరణ్ టీషర్ట్, నిక్కర్‌లో కనిపిస్తున్నారు.

ప్రస్తుతం సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. నిర్మాతగా కూడా అడుగుపెట్టిన సుష్మిత చిరంజీవి 157వ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కుటుంబం, కెరీర్ రెండింటినీ సమన్వయిస్తూ సుష్మిత కొనసాగుతున్నారు. రామ్ చరణ్‌కు అక్క సుష్మిత నుంచి వచ్చిన ఈ హృదయపూర్వక విషెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
