టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి భారీ విజయం సాధించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ డెబ్యూ చిత్రం ‘జాట్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ సక్సెస్ ట్రాక్‌లో దూసుకెళ్తోంది. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. పోటీగా మరే పెద్ద సినిమా లేకపోవడంతో, మరో వారం పాటు ఈ ఫలితాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
ఈ చిత్రంలో సన్నీ డియోల్ నటించిన యాక్షన్ సన్నివేశాలు ఉత్తర భారతదేశ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా, ఇంటర్నెట్‌లో లీక్ అయిన కొన్ని ఫైట్ సీన్లు యాక్షన్ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో చూడాలనే ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లోని ఇతర యాక్షన్ హీరోలు గోపీచంద్‌తో పని చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ యాక్షన్ స్టార్‌లైన అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్ గోపీచంద్ దర్శకత్వంలో యాక్షన్ కథల్లో నటించాలని భావిస్తున్నట్లు సమాచారం. ‘జాట్’ చిత్రంలోని యాక్షన్ డిజైన్ బాలీవుడ్‌కు కొత్తగా అనిపించడం, అక్కడి హీరోలు కూడా ఆ యాక్షన్ ట్రీట్‌మెంట్‌తో ఆకర్షితులవడం ఇందుకు కారణంగా చెబుతున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం బిజీగా ఉన్న నేపథ్యంలో గోపీచంద్‌కి బాలీవుడ్ యాక్షన్ స్టార్‌లు ఓ మంచి అవకాశంగా మారవచ్చు. అజయ్, టైగర్ లాంటి భారీ స్టార్‌లు ముందుకొస్తే, గోపీచంద్‌కి కూడా తిరస్కరించాల్సిన అవసరం లేదనే అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది.

One thought on “‘జాట్’తో బాలీవుడ్‌లో దుమ్మురేపిన గోపీచంద్.. అజయ్, టైగర్ క్యూలో?”
Comments are closed.