ప్రపంచ ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ దాదాపు పది ఏళ్ల తర్వాత తన ‘G’ లోగోలో మార్పులు చేసింది. 2015 తర్వాత ఇదే గూగుల్ లోగోకు వచ్చిన తొలి పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు.
ఇప్పటి వరకు ‘G’ లోగోలో నాలుగు సాలిడ్ రంగులు (ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం) బాక్స్‌ల రూపంలో కనిపించేవి. ఇకపై వాటి స్థానంలో గ్రేడియంట్ రూపంలో రంగుల మిశ్రమం కనిపిస్తుంది. అంటే, ఎరుపు పసుపులోకి, పసుపు ఆకుపచ్చగా, ఆకుపచ్చ నీలంగా మారుతూ అందంగా కనిపించేలా డిజైన్ రూపొందించారు.
ఈ మార్పుల వెనుక గూగుల్ తీసుకుంటున్న ఏఐ (AI) దిశలో కీలక నిర్ణయాలున్నాయని సమాచారం. కొత్త డిజైన్‌ను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా, కొన్ని ఐఓఎస్ (iOS), పిక్సెల్ పరికరాల్లో ఈ లోగో ఇప్పటికే కనిపిస్తోంది. అలాగే గూగుల్ యాప్ బీటా వెర్షన్ 16.18 కలిగిన ఆండ్రాయిడ్ పరికరాల్లోనూ ఇది దర్శనమిస్తోంది.
తాజాగా ‘G’ లోగోలో మార్పులు చేసిన గూగుల్, ప్రధాన వర్డ్‌మార్క్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఏఐ ఆధారిత సేవల పెరుగుదల దృష్ట్యా, భవిష్యత్తులో గ్రేడియంట్ డిజైన్‌ను ఇతర గూగుల్ ఉత్పత్తులకూ విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Read More : iQOO Neo 10, 26 మే న భారత్‌లో లాంచ్

One thought on “దాదాపు పదిేళ్ల తర్వాత డిజైన్ మార్పు.”
Comments are closed.