కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలోని కమినిలంక వద్ద గోదావరిలో నిన్న చోటుచేసుకున్న ప్రమాదం తీవ్ర విషాదంలో ముగిసింది. స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. ఇందులో ఏడుగురి మృతదేహాలను ఇప్పటివరకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు వెలికితీశారు. మరో యువకుడి ఆచూకీ కోసం గోదావరిలో గాలింపు కొనసాగుతోంది.
గల్లంతైన యువకుల వివరాలు : క్రాంతి, పాల్, సాయి, మహేష్, సతీష్, మహేష్, రాజేష్, రోహిత్‌గా గుర్తించారు. వీరంతా స్నేహితులుగా కలిసి గోదావరి తీరానికి స్నానానికి వచ్చారని స్థానికులు వెల్లడించారు. అయితే అంచనాకు మించి నీటి ప్రవాహం ఉండటంతో ఒక్కసారిగా వారు నీటిలో కొట్టుకుపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, గ్రామస్థులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. వరుసగా మృతదేహాలను వెలికితీస్తూ కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. మరో యువకుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక్క కుటుంబంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబాల్లో శోకం అలుముకుంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read More : మాచర్ల హత్యకేసులో పిన్నెల్లి సోదరులపై అన్యాయ ఆరోపణలు.
