తెలంగాణలో గోదావరి పుష్కరాలకు కేంద్రం చిన్న చూపు చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విమర్శించారు. పుష్కరాల నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలను సమానంగా చూడాలని కోరుతూ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసి తన అభిప్రాయాలను తెలియజేస్తానని తెలిపారు.
సోమవారం వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి కొండా సురేఖ, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్య శారదాదేవి, మేయర్ గుండు సుధారాణి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి, గత బీఆర్ఎస్ పాలనలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి క్షీణించినట్లు ఆరోపించారు. అప్పట్లో భూ కబ్జాదారులు పరిపాలన సాగించారని, ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. పేదల కలలు సాకారం కావాలంటే ఇందిరమ్మ రాజ్యం అవసరమని ఆమె స్పష్టం చేశారు.
Read More : జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద బీజేపీ ఆందోళన.. ఉద్రిక్తత

One thought on “తెలంగాణకు గోదావరి పుష్కరాల్లో అన్యాయం: మంత్రి సురేఖ”
Comments are closed.