గన్నవరం విమానాశ్రయంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది.

గన్నవరం విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. విజయవాడ నుంచి బెంగళూరుకు బయలుదేరిన విమానం టేకాఫ్ సమయంలో పక్షి ఢీకొనడంతో ప్రయాణికులు కాసేపు భయాందోళనకు గురయ్యారు. అయితే పైలట్ సకాలంలో అప్రమత్తంగా స్పందించడంతో 100 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

వివరాల ప్రకారం, గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం రన్‌వే నుంచి లిఫ్ట్ ఆఫ్ అవుతున్న సమయంలో ఓ పక్షి బలంగా రెక్కను ఢీకొట్టింది. దీంతో రెక్క భాగంలో స్వల్ప నష్టం కలిగిందని సిబ్బంది గుర్తించారు. వెంటనే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానాన్ని సురక్షితంగా నేలకు దింపడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వారిని కిందకు దించి, సాంకేతిక నిపుణులు విమానాన్ని పరిశీలించి మరమ్మతులు చేపట్టారు. గంటలోపే రెక్కకు జరిగిన నష్టాన్ని సరిచేసి, విమానం ప్రయాణానికి సురక్షితమని ధృవీకరించారు.

తరువాత అదే విమానంలో ప్రయాణికులను బెంగళూరుకు పంపించారు. సమయానికి పైలట్ చూపిన అప్రమత్తత వలననే పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

Read More : బిహార్ ఎన్నికలు: ఎన్డీయే సీట్ల పంపకంపై అమిత్ షా కీలక సమావేశం.

One thought on “గన్నవరం విమానాశ్రయంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది.

Comments are closed.