Game Changer Twitter Review: రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ పై ప్రేక్షకుల అభిప్రాయాలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, లెజండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా శుక్రవారం సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? శంకర్ కమ్ బ్యాక్ ఇచ్చారా? రామ్ చరణ్ మరియు ఇతర నటుల ప్రదర్శన ఎలా ఉంది? సినిమా ప్లస్ మరియు మైనస్ ఏంటి? సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
కొందరు ఈ సినిమాను బెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా అభివర్ణిస్తున్నారు. రామ్ చరణ్ యాక్షన్ మోడ్‌లో అద్భుతంగా నటించాడని, శంకర్ డైరెక్షన్ గొప్పగా ఉందని పేర్కొంటున్నారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కియారా అద్వానీ పర్ఫామెన్స్ కూడా హైలైట్ అని నొక్కి చెబుతున్నారు.
ఇక మరికొందరు ఈ సినిమాను ‘జస్ట్ ఓకే’ అని పేర్కొంటున్నారు. వరుస ప్లాప్స్‌తో సతమతవుతున్న శంకర్ కు ఇది కమ్ బ్యాక్ ఇచ్చే సినిమా కాదని, కేవలం రామ్ చరణ్ నటన మరియు థమన్ స్కోర్ మాత్రమే సినిమాను నిలబెట్టాయని అభిప్రాయపడుతున్నారు. కథ విషయానికొస్తే, రొటీన్ కమర్షియల్ ప్లాట్ అని, ఫస్ట్ హాఫ్‌లో బోరింగ్ లవ్ ట్రాక్ మరియు బలంలేని కామెడీ ఉన్నట్లు చెప్తున్నారు. కానీ, ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చిందని అభిప్రాయపడుతున్నారు.
సెకండాఫ్ లో మొదటి 20 నిమిషాలు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, వింటేజ్ శంకర్ డైరెక్షన్‌ని గుర్తు చేస్తుందని, ముఖ్యంగా అప్పన్న పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడని టాక్ ఉంది.
సోషల్ మీడియాలో, అభిమానులు మరియు కొందరు విమర్శకులు ఎక్స్‌ట్రీమ్ పాజిటివ్ మరియు నెగిటివ్ రివ్యూ లు ఇచ్చినప్పటికీ, మొత్తం సినిమా పై సమగ్రమైన విశ్లేషణ కోసం మరికొన్ని గంటలు వేచి చూడాల్సి ఉంటుంది.
