ఎల్లమ్మ పాత్రకు ఎవరు ఫిట్?

venu and sai pallavi

“బలగం”తో దర్శకుడిగా విజయం సాధించిన వేణు యెల్దండి, తన రెండో చిత్రంగా “ఎల్లమ్మ” ప్రకటించాడు. దిల్ రాజు సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా ఫిక్స్ అయ్యాడు. అయితే, ఇంకా హీరోయిన్ ఎంపికపై క్లారిటీ రాలేదు.

ఇటీవల సాయి పల్లవిని ఎల్లమ్మ టైటిల్ రోల్ కోసం సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆమె డేట్స్ కుదరకపోవడంతో ఇప్పటికీ హీరోయిన్ ఎంపిక ఖరారు కాలేదు. దీంతో, మరో స్టార్ హీరోయిన్ ఈ పాత్రలో కనిపించే అవకాశముందని చర్చ జరుగుతోంది.

కీర్తి సురేష్ ఈ పాత్రకు బెస్ట్ ఛాయిస్ గా ఉంటుందని అనుకుంటున్నారు. “మహానటి” సినిమాతో ఆమె నటనను ఇప్పటికే నిరూపించుకుంది కాబట్టి, ఎల్లమ్మ పాత్రకు ఆమె సరైన ఎంపికగా కనిపిస్తోంది. ఇక రష్మిక మందన్నా కూడా ఈ రేసులో ఉందని వార్తలు వస్తున్నాయి. మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికితే, ఆమె దానికి పూర్తిగా న్యాయం చేస్తుందని భావిస్తున్నారు.

సమంత ప్రస్తుతం తెలుగు సినిమాలపై ఆసక్తి తగ్గిందని టాక్ ఉంది. ఎల్లమ్మ పాత్రకు ఆమెను సంప్రదిస్తారా లేదా అన్నది ఇంకా తెలియలేదు. మరోవైపు, నిత్యా మీనన్ ఫామ్‌లో లేకపోయినా, నితిన్‌తో ఆమె చేసిన రెండు సినిమాలు హిట్ కావడంతో, ఈ పాత్రకు ఆమెను కూడా పరిశీలించే అవకాశముందని భావిస్తున్నారు.

తాజాగా నితిన్, “ఎల్లమ్మ కథ చాలా పవర్‌ఫుల్, ఇది నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ అవుతుంది” అని తెలిపారు. ఇది చూస్తే, ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యే నటికి భారీ క్రేజ్ రావచ్చని అర్థమవుతోంది.

ఎల్లమ్మ పాత్రకు చాలా పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, ఎవరిని ఫైనల్ చేస్తారో ఇంకా తెలియదు. త్వరలోనే చిత్రబృందం దీనిపై స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారం.

Read More