రాష్ట్రపతి ద్రౌపది ముర్ము: కన్నడ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను

మైసూరులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అఖిల భారత వాక్ శ్రవణ సంస్థ (AIISH) వజ్రోత్సవ వేడుకల్లో సోమవారం పాల్గొన్న రాష్ట్రపతి, కన్నడ భాష నేర్చుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.

కార్యక్రమంలో ప్రసంగం చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తన మాటలను కన్నడలో ప్రారంభించి రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ నవ్వుతూ “మీకు కన్నడ అర్థమవుతుందా?” అని అడిగారు. దీనికి సమాధానంగా రాష్ట్రపతి ముర్ము అన్నారు – “కన్నడ నా మాతృభాష కాకపోయినా, మన దేశంలోని ప్రతి భాష, సంస్కృతి, సంప్రదాయాలంటే నాకు గౌరవం ఉంది. వాటన్నిటిని నేను హృదయపూర్వకంగా ఆదరిస్తాను. కొద్దికొద్దిగా కన్నడ నేర్చుకోవడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను” అని చెప్పడంతో సభలో హర్షధ్వానాలు వినిపించాయి.

అలాగే, ప్రతి ఒక్కరూ తమ భాషను, సంస్కృతిని కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిని గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సీఎం సిద్ధరామయ్య విమానాశ్రయంలో స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు, బీజేపీ ఎంపీ యదువీర్ వాడియార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ వ్యాఖ్యలతో మైసూరు సభలో ఉత్సాహం నెలకొంది.

Read More : కొండచరియలు విరిగిపడి వెయ్యి మందికి పైగా మృతి.

One thought on “రాష్ట్రపతి ద్రౌపది ముర్ము: కన్నడ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను

Comments are closed.