తమిళ బ్లాక్బస్టర్ ‘డ్రాగన్’ (తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’) కి సంబంధించి దర్శకుడు అశ్వత్ తాజాగా ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. సినిమా ప్రారంభ దశలో కీర్తి పాత్రకు కయాదు లోహార్ ను ఎంపిక చేసినట్లు చెప్పారు. అయితే, తరువాత ఆ పాత్రకు అనుపమ పరమేశ్వరన్ సరైన ఎంపిక అని భావించి, ఆమెను ఫైనల్ చేసినట్లు తెలిపారు.
దీంతో, కయాదుకు పల్లవి పాత్ర ఇవ్వగా, ఆమె అంగీకరించి నటించిందని, అదే ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిందని దర్శకుడు పేర్కొన్నారు. ప్రస్తుతం కయాదు లోహార్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది.
AGS ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ‘డ్రాగన్’ సినిమా మైస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కేఎస్ రవికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు. సినిమా ఓటీటీలో త్వరలోనే అందుబాటులోకి రానుందని సమాచారం.

One thought on “‘డ్రాగన్’ లో ఈ పాత్రకు మొదట కయాదు లోహార్ ఎంపిక!”
Comments are closed.