కర్ణాటక అసెంబ్లీ సమావేశాల సమయంలో ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆర్‌ఎస్‌ఎస్ గీతం ఆలపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన అసెంబ్లీలో ఆర్‌ఎస్‌ఎస్ గీతం పాడటం తగదని పలువురు కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలిపారు.
ఈ వివాదంపై డీకే శివకుమార్ తాజాగా స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్ గీతం కారణంగా ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.
అసలైన విషయం ఏమిటంటే, ఇటీవల జరిగిన వర్షాకాల సమావేశాల చివరి రోజున శివకుమార్ ప్రసంగం సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ గీతాన్ని ఆలపించారు. దీంతో కాంగ్రెస్ వర్గాల్లో కలకలం చెలరేగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బికె హరిప్రసాద్ ఆయనను బహిరంగంగా నిలదీశారు.
“ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు చెందినది కాబట్టి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో గీతం పాడితే సమస్య లేదు. కానీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్‌ఎస్‌ఎస్ గీతం ఆలపించడం పార్టీకి ఇబ్బందికరమే” అని హరిప్రసాద్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
Read More : విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన

One thought on “క్షమాపణలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి”
Comments are closed.