తమిళ స్టార్ ధనుష్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ‘ఇడ్లీ కడై’ సినిమా షూటింగ్ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తేని జిల్లాలోని ఆండీపట్టిలో వేసిన స్పెషల్ సెట్స్‌లో గత 20 రోజులుగా షూటింగ్ జరుగుతోంది. అనూహ్యంగా మంటలు ఎగసిపడటంతో సెట్స్‌లో చెక్క వస్తువులు, ఫ్లెక్సీలు తగలిపోవడంతో మంటలు వేగంగా వ్యాపించాయి.
సెట్లో నటీనటులు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు గమనించిన వెంటనే ఫైర్ ఇంజన్‌కు సమాచారం ఇచ్చి మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే సెట్ 60 శాతానికి పైగా దగ్ధమైందని సమాచారం. అగ్ని ప్రమాదానికి గల కారణం ఏమై ఉండొచ్చో చిత్రయూనిట్ పరిశీలిస్తోంది.
‘ఇడ్లీ కడై’ సినిమాను ధనుష్, ఆకాష్ భాస్కరన్ కలిసి డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అరుణ్ విజయ్, సత్యరాజ్, పార్థిబన్, ప్రకాశ్ రాజ్, శాలిని పాండే, సముద్రఖని, రాజ్‌కిరణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా తొలుత ఏప్రిల్ 10న విడుదల చేయాలని భావించినప్పటికీ, అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 1కి వాయిదా వేశారు. మరోవైపు, ధనుష్ త్వరలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘కుబేర’ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

One thought on “సెట్స్‌లో అగ్ని ప్రమాదం: ధనుష్ ‘ఇడ్లీ కడై’ సినిమా చిక్కుల్లో!”
Comments are closed.