ఫాస్ట్ డెలివరీ సంస్థల ఒత్తిడితో ప్రాణాలతో చెలగాటం

ఫాస్ట్ డెలివరీ సంస్థల “ఫాస్ట్ డెలివరీ ” నినాదం ఇప్పుడు డెలివరీ బాయ్స్‌కు ఓ భారీ భారం గా మారింది. సంస్థలు విధిస్తున్న కఠిన సమయ పరిమితులను తీరుస్తామని డెలివరీ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఆ డెడ్‌లైన్‌ను చేరుకోవడానికి వారు తమ ప్రాణాలను సైతం సాహసంగా పణంగా పెట్టి అత్యంత వేగంగా వాహనాలు నడుపుతూ, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు. డెలివరీ వేగాన్ని తగ్గించుకోలేని పరిస్థితి, రెండవపక్క జీతంపై ప్రభావం పడకుండా చూసుకోవలసిన బాధ్యత ఈ యువకులను రెడ్ సిగ్నల్స్ దాటేందుకు, అసహజమైన రీతిలో వాహనాలు నడిపేందుకు దోహదపడుతోంది. ఇది రోడ్డు ప్రమాదాల సంఖ్యను పెంచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల నుంచి ఉద్యోగులను కాపాడేందుకు డెలివరీ సంస్థలు తగిన మార్గదర్శకాలు అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగుల భద్రత, హక్కులు కాపాడుతూ, సేవా నాణ్యతకు భంగం కలగకుండా సమయపాలనను నిర్వహించే విధానాన్ని అవలంబించాలని వారు సూచిస్తున్నారు.

Read More : బీహార్‌లో ఈదురు గాలులు, పిడుగుపాటుతో 25 మంది మృతి

One thought on “ఫాస్ట్ డెలివరీ సంస్థల ఒత్తిడితో ప్రాణాలతో చెలగాటం

Comments are closed.