దిల్లీ-విజయవాడ ఎయిర్ విస్తారా విమానంలో సాంకేతిక లోపం

దిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరాల్సిన ఎయిర్ విస్తారా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 9:30 గంటలకు టేకాఫ్ కావాల్సిన ఈ విమానం రన్‌వేపైకి చేరుకున్న సమయంలో సమస్య తలెత్తడంతో అకస్మాత్తుగా వేగం తగ్గించి విమానాన్ని పక్కకు మళ్లించారు.

ఈ ఘటనతో విమానంలో ఉన్న 160 మందికి పైగా ప్రయాణికులు మూడు గంటలకు పైగా విమానంలోనే నిరీక్షించాల్సి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత వారిని విమానం నుంచి దింపి ప్యాసింజర్ లాంజ్‌కు తరలించారు.

ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కూడా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. సాంకేతిక లోపంపై సిబ్బంది స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అడిగినా సిబ్బంది సమాధానాలు ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటన విజయవాడకు ప్రయాణించే వారిలో ఆందోళన కలిగించింది.

Read More : తిరుపతి ఏపీకో షోరూమ్‌లో చోరీ