ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఉరవకొండ నియోజకవర్గంలోని హంద్రీనీవా కాలువ విస్తరణ, లైనింగ్ పనులను పరిశీలించేందుకు పర్యటనను ప్రారంభిస్తారు.
ఈరోజు ఉదయం విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబు, శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం ఛాయాపురానికి చేరుకుంటారు. ఆ తర్వాత, రోడ్డు మార్గంతో హంద్రీనీవా కాలువ వద్దకు చేరుకుని, నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమవుతారు.
సీఎం పర్యటన వివరాలు:
10:00 AM: సీఎం చంద్రబాబు, ఉండవల్లి నుంచి బయలుదేరి 10:35 AMకి విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
10:40 AM: విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరి 11:20 AMకి పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
11:30 AM: పుట్టపర్తి ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 12:00 PMకి ఛాయాపురానికి చేరుకుంటారు.
12:10 PM: హెలిప్యాడ్ నుంచి బయలుదేరి, హంద్రీనీవా కాలువ పనులను పరిశీలిస్తారు.
12:45 PM: హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి బయలుదేరి 12:50 PMకి ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు.
1:30 PM: రిజర్వ్ టైమ్ తర్వాత, 2:00 PM నుంచి 3:30 PM వరకు ఛాయాపురం గ్రామపంచాయతీ ప్రజలతో ముఖాముఖి సమావేశం.
3:35 PM: హెలిప్యాడ్‌కు బయలుదేరి 4:15 PMకి పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
ఈ పర్యటన సందర్భంగా, పోలీస్ అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసారు.
Read More : జగన్ : ‘వైసీపీ కార్యకర్తల హక్కులు కాపాడతాం’

3 thoughts on “సీఎం శుక్రవారం అనంతపురంలో పర్యటన”
Comments are closed.