ఇటీవల ఉగాది సందర్భంగా ఈ చిత్రానికి ముహూర్తం జరిగింది. “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి, చిరంజీవితో కూడా పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలని నిర్ణయించారు. భీమ్స్ సంగీతం అందిస్తుండగా, చిరంజీవి స్వయంగా ఓ పాట పాడనున్నారని సమాచారం.
“విశ్వంభర” సినిమా సెట్స్‌పై షూటింగ్ ప్యాచ్ వర్క్ జరుగుతుండగా, వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా శరవేగంగా పూర్తి అవుతోంది. ఈ ఏడాదిలోనే సినిమా విడుదల కానుంది. చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు ఎవరిని ఎంపిక చేశారన్న విషయంపై ఆసక్తి నెలకొంది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
చిరంజీవి పాట పాడటం, వినూత్న ప్రమోషన్స్‌తో అనిల్ రావిపూడి భారీ హైప్ సృష్టించాలనుకుంటున్నారు. 2026 సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. మంచి సంగీతం, వినోదాత్మక కథ, మెగాస్టార్ మేనరిజం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ప్రాజెక్టుపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

One thought on “మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మాసివ్ ఎంటర్‌టైనర్!”
Comments are closed.