చైనాలో 4.5 తీవ్రతతో భూకంపం, టిబెట్‌లో రెండుసార్లు .?

China : చైనాలో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) ప్రకారం, ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు భూగర్భంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించబడింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం రాలేదని అధికారులు తెలిపారు.

అదే రోజు టిబెట్ ప్రాంతంలో కూడా రెండుసార్లు భూకంపాలు సంభవించాయి. మొదటి భూకంపం మధ్యాహ్నం 1:14 నాటికి 3.8 తీవ్రతతో చోటుచేసుకుంది. సాయంత్రం 5:07 గంటలకు మరో 3.7 తీవ్రతతో భూకంపం రికార్డు అయ్యింది. టిబెట్ భూమి టెక్టోనిక్ ప్లేట్ల కదలికల కారణంగా భూకంపాలకు సపర్దైన ప్రాంతంగా పేరుగాంచింది. ప్రస్తుతం ఈ భూకంపాల వల్ల ఎలాంటి నష్టం జరిగినదో ఇంకా పూర్తి సమాచారం అందలేదు. భూగోళ శాస్త్రవేత్తలు పరిస్థితిని ఆవలోకిస్తున్నట్లు తెలిపారు.

Read More : చర్చల ద్వారా పరిష్కారం కోరిన మాస్కో