అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన – యువతిపై యాసిడ్ దాడి!

అన్నమయ్య జిల్లాలో మరో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గుర్రంకొండ ప్యారంపల్లెకు చెందిన యువతిపై acid attack జరిగి, ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనకు సంబంధించి మదనపల్లె Amma Cheruvu Mitta ప్రాంతానికి చెందిన గణేష్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే crime scene వద్దకు చేరుకుని case నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వారి ప్రాథమిక అనుమానాల ప్రకారం, ఈ ఘటనకు ప్రేమ వ్యవహారం కారణమై ఉండొచ్చని చెబుతున్నారు.

ఇంకా బాధిత యువతి ఏప్రిల్ 29న పెళ్లి చేసుకోబోతుండగా, ఈ దారుణం చోటుచేసుకుంది. మొదట యువకుడు ఆమెపై knife attack చేసినట్లు, అనంతరం ఆమె ముఖంపై acid పోసినట్లు తెలుస్తోంది. ఆ యువతి తల్లిదండ్రులు ఈ ఘటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. Investigation పూర్తయిన తర్వాత అసలు కారణం ఏమిటనేది అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

Read More

Our YouTube Channel Click Here