విక్కీ కౌశల్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఛావా’ ప్రస్తుతం ప్రతీ చోటా చర్చనీయాంశంగా మారింది. మహారాజా శంభాజీ మహారాజ్ యొక్క గొప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్‌లో ఘనవిజయాన్ని సాధించింది. ప్రస్తుతం తెలుగులో కూడా ఈ సినిమా విడుదలైంది.
ఛావా’ సినిమా, చిన్న సినిమాగా మొదలై భారీ విజయాన్ని సాధించిన సినిమాల్లో ఒకటి. బాలీవుడ్‌లో ఈ సినిమా రూ.500 కోట్లకు పైగా వసూల్ చేసేందుకు సఫలమైంది. ఈ చిత్రం, ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితాన్ని ప్రతిబింబిస్తూ, విక్కీ కౌశల్ అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 14, 2025న థియేటర్లలో విడుదలై మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించింది.
థియేటర్లలో మంచి విజయాన్ని సాధించిన ఛావా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 11, 2025న స్ట్రీమింగ్ కానుందని సమాచారం. థియేటర్‌లో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా, ఓటీటీ విడుదలతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంటుందని అంచనాలు ఉన్నాయి.

One thought on “థియేటర్స్‌లో ఉన్నప్పటికీ ఓటీటీలోకి ‘ఛావా’!””
Comments are closed.