ఒకప్పుడు హిందీ టెలివిజన్‌లో స్టార్ నటి చారు అసోపా ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో బట్టల వ్యాపారం చేస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019లో బాలీవుడ్ నటి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్‌ను వివాహం చేసుకున్న ఆమె, కొన్ని హిందీ సీరియల్స్‌తో మంచి పేరు సంపాదించారు. వెండితెరపై అవకాశాలు వచ్చినా కొన్ని కారణాల వల్ల తిరస్కరించిన చారు అప్పట్లో మంచి గుర్తింపు పొందారు.
2021లో ఈ దంపతులకు పాప పుట్టిన తర్వాత వారి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. చివరకు 2023లో రాజీవ్ – చారు విడాకులు తీసుకున్నారు. విడాకుల సమయంలో కొంత భరణం కూడా చెల్లించాడని సమాచారం. అనంతరం పాప బాధ్యత విషయంలో కోర్టులో కేసులు నడిచాయి. చివరకు బాలిక కస్టడీ చారు అపోస కు దక్కింది.
ఇటీవల ముంబై ఖర్చులు భరించలేక రాజస్థాన్‌లోని బికనీర్‌కు వెళ్లిన ఆమె, అక్కడ ఆన్‌లైన్ ద్వారా బట్టల వ్యాపారం మొదలు పెట్టారు. తన బిజినెస్ గురించి సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ సందేశాలు ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేస్తూ కొత్త జీవితం మొదలు పెట్టిన ఆమె దృఢంగా ముందుకు సాగుతున్నారు.
ఒకప్పుడు టీవీలో వెలుగులు నింపిన నటిగా నిలిచిన చారు, ఇప్పుడు బిజినెస్‌వుమన్‌గా మారిన తీరు పలువురికి ఆవేదన కలిగిస్తోంది. అయితే ఆమె హార్డ్‌షిప్‌ను చూసి ఎంతోమంది ప్రోత్సాహకరంగా స్పందిస్తున్నారు. నటనకు గుడ్‌బై చెప్పిన చారు, తన బట్టల వ్యాపారంతో విజయవంతం కావాలని అభిమానులు సోషల్ మీడియాలో ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు.

One thought on “నటిగా వెలిగిన ఆమె.. ఇప్పుడు బికనీర్‌లో బట్టలు అమ్ముతోంది!”
Comments are closed.