ఏలూరు జిల్లాలో పర్యటనలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై ప్రభుత్వం సున్నితంగా లేదని, అలాంటి అకృత్యాలపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని హెచ్చరించారు. ముఖ్యంగా మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినవారిని ఎంతటి వారైనా చట్టం కఠినంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు.
వైఎస్ భారతి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై ప్రభుత్వమే చర్యలు తీసుకున్న నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘‘ఆసెంబ్లీలో నన్ను బూతులు తిట్టారు. అది గౌరవ సభ కాదు. గౌరవ సభగా మారిన తరువాతే సీఎంగా అడుగుపెడతానని అప్పుడే చెప్పాను’’ అని గుర్తు చేశారు. మహిళల గౌరవాన్ని కించపరిచే చర్యల పట్ల ఓనమాలు చూపేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. త్వరలోనే బీసీ సంరక్షణ చట్టం తీసుకురాబోతున్నామని, మహాత్మా జ్యోతిరావ్ ఫూలే ఆలోచనలతో స్ఫూర్తి పొందామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని వివరించారు. జిల్లాల వారీగా బీసీ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.
అమరావతిలో బీసీ విద్యార్థుల కోసం సివిల్స్ కోచింగ్ సెంటర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. పీ-4 అనే కార్యక్రమం ద్వారా సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని, మే నుంచి రూ.20 వేల సాయం దశలవారీగా అందిస్తామని వెల్లడించారు. చింతలపూడి ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్యను లక్షకు చేరేలా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ‘‘సంపద ఒక్కరికే కాదు – సమాజమంతా భాగస్వామ్యంగా ఉండాలి. 10 మంది సంపన్నులు కనీసం 20 మందికి చేయూత ఇవ్వాలి. అదే మా లక్ష్యం’’ అని తెలిపారు. ఆగిరిపల్లిలో 206 పేద కుటుంబాలకు స్థలం, ఇల్లు ఇచ్చే వరకు ఓట్లు అడగమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అర్హతలేని వారికి స్థలాలు ఇచ్చిందని విమర్శించారు.
Read More : తిరుమల గోశాలలో ఆవుల మృతి వార్తలు అసత్యం: టీటీడీ స్పష్టత

One thought on “ఏలూరు: మహిళలపై అసభ్య వ్యాఖ్యలు సహించం – ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రమైన హెచ్చరిక”
Comments are closed.