జమ్మలమడుగులో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈసారి భిన్నంగా వ్యవహరించారు. సాధారణ ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకునే ఉద్దేశ్యంతో ఆయన ఆటోలో ప్రయాణించారు. స్థానిక డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఆటోలో ప్రయాణం చేస్తూ డ్రైవర్లతో మమేకమైన సీఎం, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, జీవనోపాధి సవాళ్లపై విశదంగా చర్చించారు. ఆటో రిక్షా డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు కూడా విన్నారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Read More : మిథున్‌రెడ్డి రిమాండ్ ముగిసింది

2 thoughts on “జమ్మలమడుగులో ఆటోలో ప్రయాణించిన సీఎం”
Comments are closed.