Champions Trophy 2025: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ డేట్ వచ్చిందోచ్.. ప్లేస్ ఎక్కడంటే..
భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన ఆసక్తికరమైన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్ వేదిక దాదాపు ఖరారైంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మరియు యూఏఈ క్రికెట్ బోర్డు మధ్య జరిగిన సమావేశం అనంతరం యూఏఈలో మ్యాచ్‌లను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో సంబంధిత విశేషాలు ఇప్పుడు వెలుగు చూసాయి.
Champions Trophy 2025 Updates
ఎట్టకేలకు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్‌కు వేదికను ఖరారు చేయడం జరిగిపోయింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి తెలియజేసింది. ఈ క్రమంలో టీమ్ ఇండియా మ్యాచ్‌లకు పీసీబీ యూఏఈను ఎంపిక చేసింది. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షేక్ ముబారక్ అల్ నహ్యాన్‌తో సమావేశం అనంతరం యూఏఈను ఆమోదించారు.
అయితే, ఐసీసీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. యూఏఈలో మొత్తం మూడు ప్రధాన స్టేడియాలు ఉన్నాయి, కానీ వాటిలో అత్యంత ప్రజాదరణ పొందినది దుబాయ్. ఇక్కడ చాలా మ్యాచ్‌లు జరిగాయి. దుబాయ్ స్టేడియం సైజు పరంగా ఇతర స్టేడియాల కంటే పెద్దది కావడంతో, దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
తొలి మ్యాచ్
ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీ విజేత పాకిస్థాన్, 2025 ఫిబ్రవరి 19న కరాచీలో న్యూజిలాండ్‌తో టోర్నీని ప్రారంభించనుంది. పాకిస్థాన్ బంగ్లాదేశ్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఫిబ్రవరి 27న రావల్పిండిలో ఆడనుంది. భారతదేశం, పాకిస్థాన్, శ్రీలంకతో ఉన్న గ్రూపులలో లాహోర్, కరాచీ, రావల్పిండిలలో మ్యాచ్‌లు జరుగుతాయి.
సెమీ ఫైనల్స్ & ఫైనల్
సెమీ ఫైనల్స్ మార్చి 4, 5 న జరగనున్నాయి, అందులో మొదటి సెమీ ఫైనల్ UAEలో జరుగుతుందని భావిస్తున్నారు. దానితోపాటు, ఫైనల్ 2025 మార్చి 9న లాహోర్‌లో జరగాల్సి ఉంది. అయితే, భారత్ ఫైనల్‌కు చేరుకుంటే, ఈ మ్యాచ్ UAEలో నిర్వహించాలని ఒక నిబంధన ఉంది.
హైబ్రిడ్ మోడల్
పాకిస్థాన్, భారత్ మధ్య జరిగిన ఈ ఒప్పందం ప్రకారం, 2027 వరకు భారత్ నిర్వహించే ICC ఈవెంట్‌లలో పాకిస్తాన్ మ్యాచ్‌లు కూడా తటస్థ వేదికలలో ఆడబడతాయి. సెమీ ఫైనల్, ఫైనల్స్ వంటి నాకౌట్ గేమ్‌లు కూడా తటస్థ వేదికలలో నిర్వహించబడతాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఈ ఒప్పందం అమలు అవుతుంది.
