పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ కేసులో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్ ఫిర్యాదుతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై (Former Minister KTR) నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
కేటీఆర్ తన ట్వీట్లో పదో తరగతి మాస్ కాపీయింగ్ నిందితులతో మున్సిపల్ చైర్మన్‌కు సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రజిత శ్రీనివాస్, తమపై తప్పుడు ఆరోపణలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో కేటీఆర్‌పై రెండు కేసులు నమోదు కాగా, కాంగ్రెస్ నేత ఉగ్గడి శ్రీనివాస్ కూడా సోషల్ మీడియాలో ఆయనపై ఫిర్యాదు చేశారు.

One thought on “Case On KTR: నకిరేకల్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు”
Comments are closed.