కెనడాలోని మానిటోబా ప్రాంతంలో గగనతలంలో రెండు శిక్షణ విమానాలు ఢీకొన్న దుర్ఘటనలో భారత సంతతికి చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో కేరళకు చెందిన శ్రీహరి సుకేశ్ అనే భారతీయ యువ పైలట్‌తో పాటు 20 ఏళ్ల కెనడియన్ యువతి సవన్నా మే రోయెస్ మరణించారు. విద్యార్థులిద్దరూ శిక్షణలో భాగంగా విమానాలు నడుపుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శ్రీహరి సుఖేష్ మరణాన్ని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ధ్రువీకరిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో సహాయపడతామని పేర్కొన్నారు.
ఈ ఘటనపై కెనడా సివిల్ ఏవియేషన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు గల కారణాలు త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.
Read More : ఏకాన్ స్మార్ట్ సిటీ రద్దు – ఆఫ్రికా కలల నగరం ఆశలలోకి
