బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య: స్నేహితుల అవమానమే కారణం?

జగిత్యాల జిల్లా జాబితాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థిని కాటిపెల్లి నిత్య (21) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది. హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ ప్రైవేటు హాస్టల్లో నివసిస్తూ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న నిత్య ఇటీవల చదువులో వెనుకబడ్డదని స్నేహితులైన వైష్ణవి, సంజన ఆమెను అవమానించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో మానసికంగా కుంగిపోయిన నిత్య, ఇంటికి చేరిన అనంతరం జూలై 2వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లిన కుటుంబసభ్యులు.. ఆమెను అక్కడ చేర్పించారు. అయితే నిత్య శుక్రవారం చికిత్స పొందుతూ కన్నుమూసింది.

ఈ నేపథ్యంలో మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులైన వైష్ణవి, సంజనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జగిత్యాల రూరల్ ఎస్‌ఐ సదాకర్ తెలిపారు. ఈ ఘటన యువతలో మానసిక ఆరోగ్యం, నెగెటివ్ కామెంట్స్ వల్ల కలిగే దుష్ఫలితాలపై తీవ్ర చర్చను రేపుతోంది.

read More : Godavari : 20 అడుగులకు చేరిన నీటిమట్టం

One thought on “బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య: స్నేహితుల అవమానమే కారణం?

Comments are closed.