బీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ దుబ్బాకకు జరిగిన అన్యాయానికి హరీష్ రావు కారణమని తాను అప్పటికే చెప్పానని గుర్తుచేశారు. బీఆర్ఎస్‌లో తాను ఓడిపోవడానికి గల కారణాన్ని కేసీఆర్‌కే వివరించానని తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావులు ఒకే విమానంలో ప్రయాణించిన విషయాన్ని కూడా ముందుగానే వెల్లడించానని అన్నారు. కవిత వ్యాఖ్యల్లో కొత్తదనం ఏమీ లేదని విమర్శించారు.
మోకిల్లాలో జరుగుతున్న విల్లా ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావులపై వెంటనే ఏసీబీతో విచారణ చేయాలని సూచించారు. మాజీ డీసీపీ సందీప్ రావు అనేక అక్రమాలు చేశారని, ఆయన ద్వారానే సంతోష్ రావు సెటిల్‌మెంట్లు జరిగాయని ఆరోపించారు. కేసులో సందీప్ రావు పేరును ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. కవిత వైఖరిపై వ్యాఖ్యానిస్తూ, పార్టీలో ఉండాలా వద్దా అనే సందేహంలో ఆమె ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు. ఎమ్మెల్సీలపై ఉన్న ఆరోపణలను అప్పుడే ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. నగర శివార్లలో జరిగిన ల్యాండ్ కన్వర్షన్ల విషయాన్ని కూడా కవిత చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణలో రెండు సంవత్సరాలు వృథా చేశారని రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సంతోష్ రావు విస్తారమైన ఆస్తులు ఎలా సంపాదించారో కూడా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల గెలిచిన ఎంపీ కాదని, తన విజయమే నూటికి నూరు శాతం కరెక్ట్ అని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
Read More : కవిత సస్పెన్షన్‌పై ఆవేదన.

One thought on “బీఆర్ఎస్‌పై రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు .”
Comments are closed.