నోయిడాలోని ఓ వృద్ధురాలు సైబర్ నేరస్థుల బారిన పడి 43 లక్షల రూపాయలు కోల్పోయిన ఘటన సంచలనం రేపుతోంది. పోలీసు వేషంలో మాట్లాడిన దుండగులు, పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించిన డబ్బు ఆమె ఫోన్ నంబర్ నుండి అందిందని ఆమెను బెదిరించారు. అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందని, వెంటనే సొమ్ము చెల్లించకపోతే పోలీసులు ఇంటికే వస్తారని బెదిరించారు.
భయాందోళన చెందిన బాధితురాలు సరళాదేవి, జూలై 20 నుంచి ఆగస్టు 13 మధ్య ఎనిమిది విడతల్లో మొత్తం రూ.43.70 లక్షలు దుండగులు పంపిన క్యూఆర్ కోడ్ ద్వారా బదిలీ చేసింది. తరువాత మరో రూ.15 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఆమె అనుమానంతో లాయర్‌ను సంప్రదించింది. అప్పుడే తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రస్తుతం కేసు నమోదు చేసి సైబర్ నేరస్థుల జాడ కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read More : బీఆర్ఎస్‌పై రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు .

One thought on “నోయిడా వృద్ధురాలిపై సైబర్ మోసం.”
Comments are closed.