హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు. “గణపతి బప్పా మోరియా… రైతులకు కావాలి యూరియా” అంటూ నినాదాలు చేశారు. రైతుల సమస్యలు, ఎరువుల కొరతపై అసెంబ్లీలో చర్చ జరగాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, అసెంబ్లీని కేవలం నాలుగు రోజులు కాకుండా కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం సమగ్ర చర్చకు సిద్ధం కావాలని ఆయన హితవు పలికారు.
Read More : ప్రియుడితో కలసి భార్య ఘాతుకం

One thought on “రైతుల సమస్యలపై గన్‌పార్క్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన.”
Comments are closed.