తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపైనా, రైతుల భవిష్యత్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై మరోసారి పోరాటానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సిద్ధమవుతోంది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో త్వరలో పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల కొనసాగుతున్న వైఖరి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం, నిర్వహణ లోపాలపై విస్తృతంగా చర్చించనున్నారు.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి మౌనం వెనుక కారణాలేంటన్నదీ చర్చలో భాగంగా ఉండనుంది.
బీఆర్ఎస్ హయాంలో దాదాపు 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నేడు పట్టించుకోకపోవడాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించనున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం రెండు పిల్లర్లు కుంగాయని అబద్ధ సాకుతో మొత్తం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడమంటూ కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను పార్టీ నేతలకు వివరించనున్నారు.
రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ తిరిగి ఉద్యమ బాటపడనున్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.
Read More : హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభం.

One thought on “తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం..KCR”
Comments are closed.