కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఏర్పడిన వివాదం నేపథ్యంలో, బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నివాసాల వద్దకు భారీగా పోలీసులు చేరుకుని, వారిని ఇంటి నుంచి బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, హెచ్‌సీయూ వద్ద కూడా భారీగా పోలీసుల్ని మోహరించారు. అక్కడ నిరసనకు దిగిన సీపీఎం, సీపీఐ, బీజేవైఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని, నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ అరెస్టులో చికోటి ప్రవీణ్ కూడా ఉన్నట్లు సమాచారం.
Read More : మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానం..
