మెదడు ఆరోగ్యానికి ఉపయుక్తమైన వ్యాయామాలు

mind

నిత్యం ఒత్తిడిలో ఉండే మనిషి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. మానసిక ప్రశాంతత, మేధో వికాసం, మరియు దైనందిన పనితీరును మెరుగుపరచుకోవడానికి కొన్ని సాధారణ వ్యాయామాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

1. శ్వాస వ్యాయామం (2 నిమిషాలు)
రోజుకు కేవలం రెండు నిమిషాలపాటు శ్వాస వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు. దీని కోసం పర్వతాసన మాదిరిగా నిటారుగా కూర్చొని మెల్లగా శ్వాసను లోపలికి తీసుకుని మెల్లగా బయటకు వదలాలి. దీని ద్వారా మెదడు ప్రశాంతంగా ఉంటుందీ, ఆలోచనా శక్తి మెరుగవుతుంది.

2. కంటి వ్యాయామం (2 నిమిషాలు)
కళ్లకు విరామాన్ని ఇవ్వడం చాలా ముఖ్యం. రెండు నిమిషాల పాటు తలను కదిలించకుండా కేవలం కళ్లను ఎడమ, కుడి, పైభాగం, క్రింద భాగం ఇలా నెమ్మదిగా కదిపితే కంటి మాంసపేశులు ఉల్లాసంగా మారతాయి. దీని వల్ల కంటి చూపు మెరుగవడంతో పాటు కళ్ల ఒత్తిడి తగ్గుతుంది.

3. మైండ్‌ఫుల్ మెడిటేషన్ (5 నిమిషాలు)
దినచర్యలో ఐదు నిమిషాలు మైండ్‌ఫుల్ మెడిటేషన్ కోసం కేటాయించడం మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రశాంతంగా కూర్చొని శ్వాసను గమనిస్తూ మనస్సును ఒక స్థిర స్థితిలో ఉంచడం ద్వారా ఒత్తిడి తగ్గిపోగా మేధోశక్తి పెరుగుతుంది.

4. ఫింగర్ టాపింగ్ కోఆర్డినేషన్
బొటనవేలిని మిగతా నాలుగు వేళ్లతో ఒక్కొక్కటి టాప్ చేయడం ద్వారా నాడీ వ్యవస్థ ఉల్లాసంగా మారుతుంది. ఈ విధంగా చేయడం మెదడు మరియు శరీర భాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేలా చేస్తుంది.

ఈ చిన్న చిన్న వ్యాయామాలు పాటించడం ద్వారా రోజువారీ ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు మెదడు చురుకుగా ఉండేందుకు దోహదపడతాయి.

Read More