ఏపీలో అధికార కూటమి పరిపాలనపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. “మాట్లాడాలంటే నేను డైరెక్ట్‌గానే మాట్లాడగలను. కూటమి ధర్మం ప్రకారం ఇందులో భాగమైన అన్ని పార్టీలకు సమాన హక్కులు ఉండాలి” అని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం జనసేనకు చెందిన 21 నియోజకవర్గాల్లో ఏం జరుగుతోందో ఒక్కసారి అందర్నీ ఒకే చోట కూర్చోబెట్టి డిబేట్ పెట్టితే అసలైన పరిస్థితి అర్థమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. “మనందరం కలిసికట్టుగా పనిచేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. లేకపోతే రాబోయే ఐదేళ్లు అడుక్కుంటూ తిరగాల్సి వస్తుంది” అని బొలిశెట్టి హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు కూటమిలోని విభేదాలను మరోసారి వెలుగులోకి తెచ్చాయి.
Read More : శ్రీశైలం డ్యామ్ నుండి నీటి విడుదల…

One thought on “అసంతృప్తిని వెల్లగక్కిన జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్”
Comments are closed.