మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లోని వీరారెడ్డి నగర్లో జిమ్ కోచ్ కిషోర్ (35)పై దారుణ దాడి జరగింది. జెస్ట్ ఫిట్ అనే జిమ్‌ను నడుపుతూ కోచ్‌గా పనిచేస్తున్న కిషోర్‌పై అతని స్నేహితుడు చంటి, మరో ముగ్గురు వ్యక్తులు కలిసి డంబుల్స్తో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
కిషోర్ జిమ్‌లో ఉండగా నిందితులు అక్కడికి వెళ్లి ఊచకోతలా అతడిపై దాడికి దిగినట్టు సమాచారం. తీవ్ర గాయాల కారణంగా కిషోర్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మరణించాడు.
పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Read More : ఫిర్యాదు చేసిన వ్యక్తినే చితకబాదిన పోలీసులు..
