మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కల్నల్ సోఫియా ఖురేషి పట్ల చేసిన వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కాదంటూ ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. “మీరు ప్రజాప్రతినిధిగా ఉండి, ఇలాంటి మాటలు మాట్లాడితే దేశ ప్రజలంతా సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తుంది. మీ స్థాయి వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు విచారకరం” అంటూ ధర్మాసనం మండిపడింది.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రత్యేక బృందంలో తప్పనిసరిగా ఒక మహిళా ఐపీఎస్ అధికారి ఉండాలని స్పష్టంచేసింది.
విచారణ ప్రక్రియను పర్యవేక్షించి, తగిన ఆధారాలు సేకరించి, విచారణ నివేదికను ఈ నెల 28వ తేదీలోపు కోర్టుకు సమర్పించాల్సిందిగా ఆ బృందానికి సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
బహిరంగ వేదికలపై అధిక బాధ్యతతో ప్రవర్తించాల్సిన అవసరం ఉన్న ప్రజాప్రతినిధులు ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read More : ఆపరేషన్ సిందూర్ ఘన విజయం: Tiranga Yatra

One thought on “సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన.”
Comments are closed.