వివాహ బంధానికి విలువ తగ్గిపోతున్న సందర్భాలు దేశవ్యాప్తంగా కలవరపెడుతున్నాయి. చిన్న చిన్న గొడవలకే హత్యలు చేసే స్థాయికి దంపతుల మధ్య సంబంధాలు దిగజారిపోతున్నాయి. తాజాగా బిహార్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహమైన 45 రోజులకే ఓ యువతి తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన ఘటన కలకలం రేపుతోంది.
ఇది ఘటన ఇలా:
ఔరంగాబాద్ జిల్లా బర్వాన్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల ప్రియాన్షు ఇటీవల గుంజా దేవితో పెళ్లి జరిగింది. అయితే, గుంజాకు తన మేనమామ జీవన్ సింగ్ (55)తో ముందుగానే ప్రేమ సంబంధం ఉండేది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నా కుటుంబ సభ్యులు తిరస్కరించడంతో, ఆమెను బలవంతంగా ప్రియాన్షుతో పెళ్లి చేశారు. భర్తతో కాపురం ఇష్టంలేని గుంజా దేవి, అతడిని తొలగించాలన్న ఉద్దేశంతో మేనమామతో కలిసి హత్య కుట్ర పన్నింది. జూన్ 25న ప్రియాన్షు తన సోదరి ఇంటి నుంచి రైలు ద్వారా తిరిగి వస్తుండగా, నవీనగర్ స్టేషన్ దగ్గర బైక్‌పై ఇంటికి వెళ్లేందుకు భార్యను ఫోన్ చేశాడు. మార్గమధ్యంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అతడిని అడ్డగించి కాల్చి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భర్త మృతిలో గుంజా దేవి ప్రవర్తన అనుమానం రేపడంతో, పోలీసులు ఆమె కాల్ రికార్డులు పరిశీలించారు. దీంతో ఆమె జీవన్ సింగ్‌తో తరచూ మాట్లాడినట్లుగా బయటపడింది. ఆయన కాల్ డేటాలో షూటర్లతో సంభాషించిన ఆధారాలు కూడా లభించాయి.
ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ అమ్రిష్ రాహుల్ తెలిపారు. ఇప్పటివరకు గుంజా దేవి సహా ఇద్దరు షూటర్లు అరెస్టయ్యారు. పరారీలో ఉన్న జీవన్ సింగ్ కోసం గాలింపు కొనసాగుతోంది. మేఘాలయలో హనీమూన్ సందర్భంగా భర్తను హత్య చేసిన ఘటనను ఈ కేసు మరలా గుర్తు చేస్తోంది.
Read More : మహిళా టీచర్ లైంగిక వేధింపులు…

One thought on “బిహార్‌లో సంచలన ఘటన”
Comments are closed.