స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ హిందీ చిత్రరంగంలో తన ముద్ర వేయడంలో ‘భజరంగీ భాయిజాన్’ సినిమాతో మొదలయ్యింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించి, కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 75 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడగా, బాక్సాఫీస్ వద్ద ఏకంగా 900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సల్మాన్ ఖాన్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. ఆ విజయంతో బాలీవుడ్‌లో విజయేంద్ర ప్రసాద్‌కి డిమాండ్ పెరిగింది.
తరువాత ‘మణికర్ణిక’ సినిమాకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ మరోసారి హిట్ కొట్టారు. అయితే ‘భజరంగీ భాయిజాన్’ తర్వాత సల్మాన్ ఖాన్ ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయారు. మధ్యలో ఎన్నో ప్రయోగాలు చేసినా, రీసెంట్‌గా మురగదాస్‌తో చేసిన ‘సికిందర్’ కూడా ఫెయిలైపోవడంతో, మరోసారి విజయేంద్ర ప్రసాద్ వద్దకే సల్మాన్ తిరిగొచ్చినట్టు వార్తలు వచ్చాయి.
తాజాగా, ‘భజరంగీ భాయిజాన్’కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం సల్మాన్, విజయేంద్ర ప్రసాద్‌తో కథా చర్చలు మొదలుపెట్టినట్టు తెలిసింది. డైరెక్టర్ కబీర్ ఖాన్ కూడా ఈ సీక్వెల్ కు ఆసక్తి చూపుతున్నారట. బాలీవుడ్ రచయితల కథలు సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో, మళ్లీ టాలీవుడ్ స్టార్ రైటర్ సహాయాన్ని కోరడం ద్వారా సల్మాన్ ఖాన్ మరోసారి పాన్ ఇండియా హిట్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలుస్తోంది.

One thought on “స్టార్ రైటర్‌తో మళ్లీ చేతులు కలిపిన బాలీవుడ్ భాయిజాన్!”
Comments are closed.