దుల్కర్ సల్మాన్ హీరోగా, సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాంత’ సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల దుల్కర్ ఫస్ట్ లుక్ విడుదలై 1950ల స్టైల్‌లో ఆయన లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ లుక్‌తో పాటు సినిమాపై అంచనాలు గణనీయంగా పెరిగాయి.
తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇది ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్ కావడం విశేషం. చీర కట్టు, బొట్టు, గాజులతో సంపూర్ణంగా 1950ల తెలుగు యువతిగా భాగ్యశ్రీ మెరిసింది. ఈ లుక్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కథ, లుక్స్, మేకింగ్ పరంగా చిత్రబృందం ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించేందుకు కృషి చేస్తోంది. ఇందులోని ప్రతి అప్డేట్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం విశేషం.
కాంత సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. 1950ల నాటి కథా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా విశేష ఆకర్షణగా మారుతోంది. హీరోయిన్ లుక్‌తో పాటు తదుపరి అప్డేట్స్‌పై కూడా భారీగా ఆసక్తి నెలకొంది.

One thought on “రెట్రో లుక్‌లో మెరిసిన కాంత హీరోయిన్ భాగ్యశ్రీ”
Comments are closed.